సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – సర్పంచ్ బొబ్బ వెంకట్ లక్ష్మి. – పేరుమండ్ల సంకీసా లో హెల్త్ క్యాంప్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – సర్పంచ్ బొబ్బ వెంకట్ లక్ష్మి. – పేరుమండ్ల సంకీసా లో హెల్త్ క్యాంప్

డోర్నకల్,సెప్టెంబర్-29, జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సెంటర్లో శుక్రవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బొబ్బ వెంకట్ లక్ష్మి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో సహజంగా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నందున వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హెల్త్ క్యాంప్ లో చెక్ చేపించుకోవాలని ఆమె అన్నారు. ఈ హెల్త్ క్యాంప్ లో రక్త, బీపీ,షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగిందని డోర్నకల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ పృద్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ విజయ, ఎంఎల్ హెచ్పి రమ్య, ఏఎన్ఎం మరియమ్మ, ఆశ వర్కర్లు రాధిక, భారతి, శారద, పంచాయతీ కార్యదర్శి హరి ప్రసాద్, గ్రామపంచాయతీ సిబ్బంది లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు