సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    – ఆయుర్వేద వైద్యురాలు చైతన్య అమృత
హత్నూర

(జనం సాక్షి)

వర్షాకాలం సీజన్లో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ పి.హెచ్.సీ ఆయుర్వేద వైద్యురాలు చైతన్య అమృత అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమె వివరించారు.వాతావరణ కలుషితం వల్ల విషజ్వరాలు,కలరా,వాంతులు విరేచనాలు తదితర వ్యాధులు సోకే ఆస్కారముందని ఆమె పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత  పాటించడంతో పాటు నివాస పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ప్రధానంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలని ఆమె కోరారు.బయట దొరికే తినుబండారాలు,కలుషిత నీరు,గాలితో మలినమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని ఆమె సూచించారు.వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంది కనుక కాచి చల్లార్చిన నీటిని సేవించడం శ్రేష్టమైనదని ఆమె చెప్పారు.నీటి నిల్వ ప్రదేశాలను నిర్మూలించడం,దోమ తెరలు వాడడం,తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం లాంటివి పాటించడం ద్వారా వ్యాధుల బారినపడకుండా ఉంటామని ఆమె సూచించారు.
Attachments area