సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్
టేకులపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): వర్షాలు అధికం కావడంతో మురుగునీరు నీటి నిలవలు మూలాన దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ఉధృతం కావడానికి అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ సూచించారు . శుక్రవారం మండల పరిధిలోని ఎర్రాయిగూడెం స్టేజి లో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ విరుగు నరేష్ పర్యవేక్షణలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 45 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్సను అందించడం జరిగింది .జ్వరంతో బాధపడుతున్న 4 గురికి రక్త పరీక్షలు చేశారు. గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత ఈ సీజన్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని, ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలని వైద్యాధికారి సూచించారు. ఈ సీజన్లో వచ్చే వ్యాధులు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ తో కలిసి గ్రామంలో పైరిత్రిమ్ స్ప్రే చేపిస్తూ ప్రతి ఇల్లు తిరిగి నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమలు ,ఈగల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లు 20 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిన నీటిని తాగటంతో రక్షితమైన తద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని ప్రజలకు సూచించారు. అత్యంత పరిశుభ్రంగా ఆకుకూరలు, కాయగూరలు పావుగంట ఉప్పు నీళ్లలో నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే వాటి�