సీపీఐ చేర్యాల మండల 12వ మహాసభలు విజయవంతం
సీపీఐ మండల కమిటీ నియామకం..
చేర్యాల (జనంసాక్షి) జులై 23 : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) చేర్యాల మండల కార్యదర్శిగా అందె అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ శనివారం ప్రకటించారు. పట్టణంలోని వాసవి గార్డెన్ లో జరిగిన 12వ మహాసభలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, చేర్యాల పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, యువకుల ఉపాధి కల్పనకు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, కాలువల పనులు పూర్తి చేసి గోదావరి జలాల సాగునీరుతో చేర్యాల ప్రాంత చెరువులు, కుంటలు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని సభలో తీర్మానం చేసి ఆమోదించారు. భవిష్యత్తులో ఈ సమస్యలపై సీపీఐగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఈసందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి అందె అశోక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మండల సహాయ కార్యదర్శులుగా బండారి సిద్ధులు, పొన్నబోయిన మహేందర్, కోశాధికారిగా బండారి కనకయ్య కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులుగా ఈరి భూమయ్య, మేడబోయిన రాములు, గూడెపు సుదర్శన్, మేకల రజిత, జూకంటి చంద్రం, పోకల కనకయ్య, కేసిరెడ్డి బాల్ రెడ్డి, పుల్లని వేణు, కడారి రాజు, గజ్జల సురేందర్, పల్లెమేని రవి, ముస్త్యాల శంకరయ్య, బియ్య బాలరాజు, అవుశర్ల కృష్ణ, చెట్కూరి ప్రశాంత్, పోన్నబోయిన కనకయ్య, మనెపల్లి కిష్టయ్య, కర్రె రవి, గూడెపు పెంటయ్య, ఇప్పకాయల వెంకటేశం, బండారి రాజయ్య మొత్తం 25 మందితో కమిటీని నియమించారు. తమ ఎన్నికకు కృషి చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.