సీబీఐపై సిఫార్సులకు కేంద్రమంత్రి మండలి ఆమోదం

ఢిల్లీ,(జనంసాక్షి): సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై మంత్రుల బృందం చేసి సిఫార్సులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీబీఐ దర్యాప్తు తీరును రిటైర్డ్‌ జడ్జిలు పర్యవేక్షిస్తారు. రాజకీయ , బయట శక్తుల ప్రమేయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు. సీబీఐ డైరెక్టర్‌కు మరిన్ని ఆర్థికాధికారాలు ఇస్తారు. సీబీఐ డైరెక్టర్‌ నియామకానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తారు. కొలీజియం ద్వారా సీబీఐ డైరెక్టర్‌ నియామకం జరుగుతుంది. జులై 3 న కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయనుంది.