సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: సుప్రీంకోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆల్తమన్ కబీర్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. 64 ఏళ్ల ఆయన వచ్చే ఏడాది జూలై వరకు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ కబీర్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ కబీర్ గతంలో మానవహక్కులు, ఎన్నికల చట్టాలకు సంబంధించి పలు చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు.