సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సింధు బోణీ

పవర్‌ గేమ్‌తో చెలరేగిన సింధు సూపర్‌ సిరీ53769182స్‌ ఫైనల్స్‌లో బోణీ కొట్టింది. గ్రూప్‌-బి తొలి రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో సింధు 12-21, 21-8, 21-15తో అకానె యమగూచి (జపాన్‌)ని మట్టికరిపించింది. గంటా 3 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు, యమగూచి హోరాహోరీగా తలపడ్డారు. సుదీర్ఘ ర్యాలీ గేమ్‌లు.. పవర్‌ గేమ్‌ ప్రధానంగా సాగిన మ్యాచ్‌లో ఇద్దరు క్రీడాకారిణులు చివరి వరకు పోరాడారు. అలసినా.. శక్తి తగ్గినా.. ఏ ఒక్క పాయింటు దగ్గర రాజీపడకుండా ఆడారు. ఫిట్‌నెస్‌లో మెరుగ్గా ఉన్న సింధు ప్రత్యర్థిని తెలివిగా ఓడించింది. నిజానికి తొలి గేమ్‌లో సింధు తేలిపోయింది. యమగూచి కొలిచినట్లుగా బేస్‌లైన్‌ షాట్లు ఆడటంతో సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. షటిల్‌ను అంచనా వేయలేక ఔట్లు కొట్టేసింది. అసహనంతో కోర్టులోనూ చురుగ్గా కదల్లేకపోయింది. దీంతో వూహించని విధంగా 12-21తో తొలి గేమ్‌ యమగూచి సొంతమైంది. ఐతే రెండో గేమ్‌ మొదటి పాయింటు నుంచి సింధు ఆట మారింది. దూకుడు పెంచి.. తొలి పాయింటు నుంచే స్మాష్‌లతో ఆకట్టుకుంది. 7-7తో స్కోరు సమమైన స్థితిలో వరుసగా 13 పాయింట్లు రాబట్టింది సింధు. 21-8తో అలవోకగా గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆసక్తికరంగా సాగింది.  అదే అదనుగా సింధు మరింత జోరు పెంచి ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించింది. 11-7తో ఆధిక్యం సంపాదించిన సింధు పదునైన స్మాష్‌లు, డ్రాప్‌ షాట్లతో చకచకా మ్యాచ్‌ను సొంతం చేసుకునే దిశగా సాగింది.