సూరయ్యపల్లి ఎస్సీ కాలనీలో భోజనం ప్యాకెట్ల పంపిణీ
జనంసాక్షి, మంథని: వరదలతో ముంపు గురైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి ఎస్సీ కాలనీలోని కుటుంబాలకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంథని కౌన్సిలర్ పెండ్రి రమాదేవి , మాజీ వార్డు సభ్యులు నిహారిక, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



