సెప్టెంబర్ నెల వేతనాల చెల్లింపులో ఆలస్యం..

సెప్టెంబర్ నెల వేతనాల చెల్లింపులో ఆలస్యం

ఈ సందర్భంగా పి.మాధవ నాయక్, కార్యదర్శి, జబీసీసీఐ సభ్యులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. అందులో భాగంగా 1. 7. 2021 నుండి 11వ వేతన సవరణ అమలు జరగాలి.బిఎమ్మెఎస్ జాతీయ నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి కృషితో తేది. 6.5.2021 అనగా 54 రోజుల ముందుగా జేబీసీసీఐ-11వ కమిటీ ఏర్పాటుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు ప్రహ్లాద జోషి ని ఒప్పించి అనుమతిని తెచ్చారు. ఇది చారిత్రాత్మకం, సమ్మెలు లేకుండా ఆందోళనలు లేకుండా సాధించిన ఘనత. ఆ తర్వాత పది దఫాల చర్చల అనంతరం మే 20.2023 న జెబిసీసీఐ -11వ వేతన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం మినిమం గ్యారంటీ బెనిఫిట్ 19% పెరిగింది. అలవెన్స్ లపై 25% పెరుగుదలతో జూన్ నెల నుండి అమల్లోకి వచ్చింది. డిపి గైడ్లైన్స్ ప్రకారము కోల్ మినిస్ట్రీ అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే అమల్లోకి వచ్చింది.
కానీ దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న అధికారులు కార్మికుల జీతాల పెరుగుదలపై ఓర్వలేనితనంతో, అవగాహన రాహిత్యంతో కార్మికుల జీతాల పెరుగుదలపై కక్ష కట్టి, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల సంఘం *”ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్స్”(ఏఐఏసిఈ) ఆధ్వర్యంలో జబల్పూర్ హైకోర్టు లో కార్మికుల జీతాలు అధికారుల కంటే ఎక్కువ పెరిగాయని కావున అధికారులకు వెంటనే జీతాలు పెంచే వరకు కొత్త జీతాలు నిలుపుదల చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డిపి గైడ్లైన్స్ ను సాకుగా చూపారు. తేది. 29.8.2023న గౌరవ జబల్పూర్ హైకోర్టు సెప్టెంబర్ నెల జీతాలు పదో వేతన ఒప్పందం ప్రకారంగామే చెల్లించాలని తీర్పునివ్వడం జరిగింది.ఈ తీర్పును సవాలు చేస్తూ కోల్ ఇండియా యాజమాన్యం హైకోర్టు డివిజనల్ బెంచ్ లో కేసు పునః పరిశీలనకు వేయడం జరిగింది. ఈనెల మూడవ తేదీన డివిజన్ బెంచ్ ముందుకు ఈ కేసు రానున్నది. కావున అంతవరకు పేస్లిప్స్ తయారు చేయకుండా కోల్ ఇండియా యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి జాతీయ కార్మిక సంఘాలు బిఎమ్మెఎస్ జాతీయ నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి నాయకత్వంలో 14.9.2023 అన్ని కార్మిక సంఘాలతో రాంచీలో సమావేశం నిర్వహించి ఈ నేల 5, 6,7.2023 న 3 రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కోల్ ఇండియా యాజమాన్యం న్యూఢిల్లీలో 27.9.2023 న చర్చలు జరిపింది. కోల్ ఇండియా సిఎండి గారు హైకోర్టులో ఈ కేసును డివిజనల్ బెంచ్ ముందు గట్టిగా వాదనలు వినిపించి స్టే విధించే ప్రయత్నం చేస్తున్నాము కావున కార్మిక సంఘాలు సహకరించాలని కోరారు. కావున జాతీయ సంఘాల నాయకులు అట్టి సమ్మెను ఈనెల 12 ,13 , 14 వ తేదీల్లో వాయిదా వేయడం జరిగింది. బి ఎం ఎస్ మరియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోల్ ఇండియాలో మూడవ తేదీన అనగా 3.10.2023 బొగ్గు గనులపై ధర్నా లతో నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. కావున సింగరేణి కార్మికులు కూడా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి అవశ్యకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గతంలో దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు, అధికారులకు, ఐదు సంవత్సరాల వేతన ఒప్పందం ఉండేది. కానీ అధికారులు 2007వ సంవత్సరం నుండి పది సంవత్సరాల వేతన ఒప్పందానికై యాజమాన్యం ప్రతిపాదనను ఒప్పుకోవడం జరిగింది. ఆ ప్రతిపాదనను ఆ నాటి కార్మిక సంఘాలు తిరస్కరించారు. కావున కార్మికుల జీతాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరణ జరుగుతుంది. అధికారుల జీతాలు 10 సంవత్సరాలకు ఒకసారి సవరణ జరుగుతుంది. ఇందులో అధికారులకు 10 సంవత్సరాల వేతన సవరణ మూలాన డిఏ తో పాటు 35% అలవెన్సులు ఇస్తున్నారు. ఈ 35 శాతం అలవెన్స్ పై ఇన్కమ్ టాక్స్ ను యాజమాన్యమే చెల్లిస్తుంది. పి. అర్. పి. పేరుతో లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం అదనంగా బోనస్ రుపంలో తీసుకుంటున్నారు. అయినా కార్మిక సంఘాలు ఏనాడు వీటిని ప్రశ్నించలేదు. కార్మికులకు ఏం కావాలో దానిపై మాత్రమే పోరాటం చేస్తూ సాధించు కుంటున్నారు. అయినను కార్మికుల జీతభత్యాలపై, పెరుగుదలపై అధికారులు అక్రోశాన్ని వెలగక్కటం శోచనీయం. కావున కార్మికులందరూ సంఘటితంగా తేది 12.10.23 నుండి 14.10.23 వరకు జరిగే సమ్మెను, ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా
పి. మాధవ నాయక్ కార్యదర్శ,ఏబికెఎమ్మెస్ -బిఎమ్మెస్,
జబీసీసీఐ,సిపిఆర్ఎమ్మెస్ -ఎన్ ఈ సభ్యులు పేర్కొన్నారు…… (ప్రత్యేక ప్రతినిధి /జనం సాక్షి )