సైబర్ నేరాలు ,ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన

మండల పరిధిలోని అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైబర్ నేరాల పైన, ట్రాఫిక్ రూల్స్,బాల్య వివాహాల,విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ఆర్ శేఖర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రజలను సైబర్ నేరగాళ్లు సులభంగా ఆన్లైన్ మోసాలకు గురి చేస్తూ వారి బ్యాంకు అకౌంట్లో నుండి డబ్బులు దోచుకునే విధానం గురించి తెలియజేశారు. ఎవరైనా అకౌంట్ లో డబ్బులు మాయమైనప్పుడు 1930 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు.ప్రమాదంలో ఉన్న సందర్భంలో 100 నెంబర్ కి కాల్ చేయాలని, బాల్యవివాహాలను,బాల కార్మికులను గమనించినప్పుడు 1098 నెంబర్ కి కాల్ చేయాలని,సూచించడం జరిగినది.వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ విషయాలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసేలా చెప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకమ్మ ఉపాధ్యాయులు శోభారాణి ,నాగరాణి, ప్రసన్నకుమార్ ,అనిత,సుష్మ ప్రియాంక, వెంకట్ రాములు, ఈరన్న,అరుణ రాణి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు