సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 18( జనం సాక్షి )సిద్దిపేట పట్టణం గవర్నమెంట్ న్యూ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, సిద్దిపేట షీ టీమ్ సిబ్బంది సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ టెక్నాలజీతో చాలా ఉపయోగాలు ఉన్నాయని దాని మాటున్నే సైబర్ నేరాలు దాగి ఉన్నాయని గూగుల్ పే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ కు వచ్చే గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఎలాంటి లింక్స్ కూడా ఓపెన్ చేయవద్దని సూచించారు. ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నా, కొంతమంది వ్యక్తులు సైబర్ నేరాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు,సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాల వలలో పడకుండా జాగ్రత్త చర్యల తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ..సైబర్ పోలీసుల వారి సూచనలు తప్పక పాటించండి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటిపి తదితర నెంబర్లు ఎవరికీ తెలుపకూడదు, సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, 112 లకు కాల్ చేయండి తదితర అంశాల గురించి. ఆన్లైన్లో లోన్ తీసుకొని ఇబ్బందులకు గురి కావద్దు, లోన్ తీసుకున్న తర్వాత లోను కట్టేటప్పుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. లాటరీ తలిగిందని బంపర్ ఆఫర్ కార్లు వచ్చాయి మోటార్ సైకిల్ వచ్చాయని సైబర్ నేరగాళ్లు పంపే ఎస్ఎంఎస్ లకు ఆశపడి డబ్బులు పంపించి మోసపోవద్దు,
గుర్తుంచుకోండి. ముందు చాటింగ్ తర్వాత చీటింగే. కేవలం ప్రొఫైల్ ఫోటో చూసి వారి ఆకర్షణలో పడకండి మోసపోకండి. మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు ,మీరు నిశ్శబ్దంగా వుండండి.గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి అందులో వచ్చిన నెంబర్ కి కాల్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీరు నిజమైన కస్టమర్ కేర్ సర్వీస్ వాళ్ళతోనే మాట్లాడుతున్నారా లేదా సైబర్ నేరగాళ్లతోనా ??,,,
Amazon, Flipkart, ebay వంటి ఈ-కామర్స్ వెబ్సైట్ పేర్లతో అబద్దపు వెబ్సైట్లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ వెబ్సైట్లలో వస్తువులు ఆర్డర్ చేయడం కానీ, కమీషన్ కోసం ఎవరికీ ఏ ఆర్డర్ పరిచయం చేయడం కానీ చేయకండి. ఈ వెబ్సైట్లను నమ్మవద్దు నమ్మి మోసపోవద్దని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గీతాదేవి, మరియు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు 180 మంది, షీ టీమ్ సిబ్బంది సిద్దిపేట షీటీం సిబ్బంది మమ్మద్ ముజీబ్ హైమద్, ఏఎస్ఐ. మహిళ కానిస్టేబుళ్లు పద్మ, సంగీత, కానిస్టేబుళ్లు స్వామి, ప్రకాష్, రవి. తదితరులు పాల్గొన్నారు.