సోడియం శచరిస్ కెమికల్ ప్లాంటు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

 మిర్యాలగూడ, జనం సాక్షి
 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం వాడపల్లి  కృష్ణ గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ కంపెనీ ముసుగులో 12వేల టి పి ఏ సోడియం  శాచరీస్ ప్లాంట్ ద్వారా సోడియం డైక్రోమేట్ 50 వేల టిపిఏ ఉత్పత్తుల కెమికల్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని చేయని యెడల ఆరోజు ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటామని మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి  డిమాండ్ చేశారు శనివారం స్థలాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ కెమికల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమించి కృష్ణానదికి తొమ్మిది కిలోమీటర్ల దూరం చుట్టుపక్కల ఉండే గ్రామాలకు 7 కిలోమీటర్ల దూరంలో స్థాపించాలే కానీ కంపెనీ వారు వాటన్నిటిని తుంగలో తొక్కి ప్రజల ఆయురారోగ్యాలు  కలుషిత నీరు త్రాగడం వలన పశువులు చనిపోవడం జరిగింది గతంలో దామరచర్ల మండల కేంద్రంలో దక్కన్ క్రోమేట్స్ కెమికల్ కంపెనీ వ్యర్ధాల వలన. అదే తరహాలో ఇరికిగూడెం వాడపల్లికి మధ్యలో నిర్మించే కెమికల్ ఫ్యాక్టరీ వలన కృష్ణానది ఎంతవరకు ప్రవహిస్తదో అక్కడంతా కూడా ప్రజలందరూ ఇబ్బందులకు గురి అవుతారు అలాగే భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతిని ఆ నీళ్లు తాగే పశువులు కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది అలాగే ప్రజలందరూ కూడా ఊపిరితిత్తుల సమస్యలతో క్యాన్సర్ వ్యాధితో చనిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెమికల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని  ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అధికారులు చొరవ చూపాలని బిఎల్ఆర్ గారు కోరినారు ఒకవేళ ప్రజలకు హాని జరిగే ఈ కెమికల్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇరికిగూడెం వాడపల్లి గణేష్ పాడు దామరచర్ల ప్రజలందరినీ  కూడగట్టి వారికి కెమికల్ ఫ్యాక్టరీ స్థాపించడం వలన జరిగే నష్టాలను తెలియపరచి అడ్డుకుంటామని హెచ్చరించినారు ఇట్టి కార్యక్రమంలో ఎల్ వి సత్యనారాయణ దామరచర్ల సర్పంచ్ బంటు కిరణ్ ఉత్తలగడ్డ సర్పంచ్ భాషా నాయక్ నాగు నాయక్ దుర్గాప్రసాద్ చెన్నయ్య సదానందం నాగయ్య  అనిల్  రమణ మోహన్ రెడ్డి రవి నాయక్ బెజ్జం సాయి సిద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు
Attachments area