స్త్రీల గ్రహస్థితి బాగోలేదట! ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి ఉవాచ
రాయ్‌పూర్ : ఢిల్లీ ఘటన నేపథ్యంలో మనదేశంలో నేతల మనసులో మాటలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి నోరు విప్పారు. ఓపక్క కంకర్ జిల్లా గిరిజన బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చి రెండు రోజులన్నా కాలేదు సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోంమంత్రి నాన్కీరామ్ కన్వర్ ఇలా వ్యాఖ్యానించారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో ఎవరం ఏం చేయలేం వారి గ్రహస్థితి బాగోలేదంతే.. అంటూ నిట్టూర్చారాయన , ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మాత్రం ఆ వ్యాఖ్యాలపై ఇంకా నేనేం అనగలను అంటూ పెదవిరిచారు.