స్థిరంగా ఉపరితల ఆవర్తనద్రోణి

విశాఖపట్నం : రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాలపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖలోని వాతాఆరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని చోట్ల మామూలు స్థాయిలోను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు చెప్పారు. కోస్తాంధ్ర పరిసరాల్లో అల్పపీడనం బలహీనపడిందిని, ఇక దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడతాయని అధికారులు చె ప్పారు. మొత్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వరుసగా ఐదు రోజుల పాటు అతలాకుతలం చేసిన వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ముంపు బెడద ఇంకా వెంటాడుతూనే ఉంది. మంగళవారం ముఖ్యమంత్రితోపాటు పాలక, ప్రతిపక్షాల నేతలు పెద్దఎత్తున ఆయా జిల్లాల్లో పర్యటించారు.