స్పాట్‌ దోషులపై కఠిన చర్యలు: జైట్లీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు, బోర్డు క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరుణ్‌ జైట్లీ తెలిపారు. స్పాట్‌ ఫిక్సింగ్‌పై నిర్ణీత గడువులోపుగా స్వుచ్చపూరిత వాతావరణంలో నిష్పక్షపాత దర్యాప్తు జరిపిస్తామన్నారు. బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ఏసీఎస్‌యూ) ఈ వ్యవహారం చూసుకుంటుందని చెప్పారు. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించిందని జైట్లీ తెలిపారు.