స్పేయ్రర్లపై అవగాహన కరవు

రైతులకు సకాలంలో అందని మిషన్లు
విజయవాడ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున నిధులు
మంజూరు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం విడుదలైన  నిధులతో యాంత్రీకరణ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశిరచింది. రైతుల అభిరుచి, అవసరాల మేరకు స్పేయ్రర్లను మంజూరు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తైవాన్‌ స్పేయ్రర్లు పంపిణీ చేస్తున్నా.. కొన్ని జిల్లాలో వీటి ఊసేలేదు. అధికారులు జిల్లాకు వీటిని కేటాయించలేదని చెబుతున్నారు.  అధికంగా సాగయ్యే వరి, పత్తి, కూరగాయలు, మిరప వంటి పంటలకు పురుగుల మందు, ఎరువులు పిచికారీ చేయడంలో ఇవి కీలకమని వ్యవసాయా ధికారులు చెబుతున్నారు. స్పేయ్రర్లు అడిగిన వారందరికీ ఇస్తామని, రైతులు ముందుకు వస్తే చాలు తక్షణం మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.  పంపిణీ కూడా సకాలంలోనే జరుగుతోందని,ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా స్పేయ్రర్లకు కేటాయించిన నిధులు ఖర్చవుతాయన్నారు. కానీ పరిస్థితి వేరుగా ఉందని రైతులు చెబుతున్నారు. లక్షల నిధులు విడుదల చేసినా అధికారులు సకాలంలో  స్పందించక పోవడం, అన్నదాతల్లో అవగాహన కొరవడటంతో స్పేయ్రర్లు రైతులకుచేరడం లేదు.  రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే వీటిని మంజూరు చేయాల్సి ఉంటుంది. అయిదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు 50 శాతం రాయితీ, అయిదెకరాలకు పైగా పొలం ఉన్న రైతులకు 45 శాతం రాయితీపై వీటిని అందించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకైతే 75 శాతం రాయితీపై వీటిని సమకూర్చాలి. ఆయా స్పేయ్రర్లపై రైతులకు పెద్దగా అవగాహన లేనందున  వ్యవసాయాధికారులు అవగాహన కల్పించక పోవడంతో వీటిని పొందలేకపోయారు.