హన్మకొండ నడ్డా సభకు తరలిన భాజాపా శ్రేణులు
నిర్మల్ బ్యూరో, ఆగస్టు27,జనంసాక్షి,, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్బంగా హన్మకొండ లో జరిగే సభ కు శనివారం నిర్మల్ జిల్లా నాయకులు కార్యకర్తలు బయలుదేరివెళ్లారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధానకార్యదర్శి మెడిసెమ్మె రాజు,డా,మల్లికార్జున రెడ్డి లు మాట్లాడుతూ కెసిఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన బీజేపీ విజయ యాత్ర ను ఆపలేడని, తన కుటుంబసభ్యులు చేసిన అవినీతి ని ప్రజల దృష్టిని మల్లించే ప్రయత్నం మే రాష్ట్రం లో జరుగుతున్న వరుస పరిణామలని ప్రజల గ్రహిస్తున్నారని, రాష్ట్రములో మతఘర్షణలు సృష్టించి వాటిని బీజేపీ పై నెట్టాలని కెసిఆర్, కేటీర్ చూస్తున్నారని ఆరోపించారు, బీజేపీ నాయకుల జోలికి వస్తే తెరాస పార్టీ కి సమాధి కట్టడం కాయం అని ఈ సందర్బంగా హెచ్చరించారు ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి లు సామ రాజేశ్వర్ రెడ్డి, పడిపెల్లి గంగాధర్, జిల్లా కార్యదర్శి లు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి, మిట్టపెల్లి రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుముల శ్రావన్, పొన్నం నారాయణ గౌడ్,మండల అధ్యక్షులు ఠాకూర్ అర్జున్, ప్రేమ్కుమార్, అనిల్, లింగా రెడ్డి, బర్కుంట,నరేందర్,తదితరులు బయలుదేరి వెళ్లారు.