హరితహారం ఛాలెంజ్
జనగామ,జూలై28(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జనగామ జిల్లా వాసులంతా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు. రైతు తమ వ్యవసాయ భూమిలో ఆ మొక్కలు నాటాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కకు పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.ఇకపోతే వచ్చే నెల 14వరకు ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని, నిర్మించుకోని వారుంటే వెంటనే నిర్మించుకోవాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో గ్రామంలో ఆరుబయటకు వెళ్తున్న వారిని గుర్తించి మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కృషి చేయాలన్నారు. లేకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్ భగీరథ నీరు గ్రామాల్లోకి సరిగా వచ్చే విధంగా గేట్‌వాల్వ్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులనుఆదేశించారు.