హరితహారానికి యువత ముందుకు రావాల
పట్టణాల్లో మొక్కలు నాటేలు చర్యలు
సిద్దిపేట,జూలై16(జనం సాక్షి ): హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని పట్టణాల్లో మొత్తం రెండు లక్షల మొక్కలను నాటాలని లక్ష్యం నిర్దేశించుకొన్నారు. నాటే మొక్కలు బతికేలా ఆయా పురపాలకాల అధికారులు చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు. గ్రామ యువకులు పర్యావరణాన్ని కాపాడేందుకు మంచి మొక్కలను నాటే చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లోని యువకులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంట్లో మొక్కలను నాటాలని సూచించారు.మొక్కలు నాటి వదిలేయ కుండా ఈ సారైనా వాటిని సంరక్షించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లోని రైతులకు టేకు మొక్కలు పంపిణీ చేసి, వాటిని పొలాల గట్లపై నాటే విధంగా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీవో అధికారులు అన్నారు. హరితహారంలో భాగంగా అటవీరేంజ్ పరిధి అటవీ ప్రాంతంలో మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. శాఖలవారీగా టార్గెట్, నాటబోయే మొక్కల సంరక్షణ, వివిధ నర్సరీలవారీగా మొక్కల వివరాల గురించి మండల అధికారులతో చర్చించారు. రానున్న హరితహారంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.