హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి
చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న
హుస్నాబాద్ ఆగస్టు 25(జనంసాక్షి)హుస్నాబాద్ పట్టణం లో హరితహారం లో భాగంగా 13 వ,వార్డు లో గురు వారం చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణం లో ప్రతి ఇంటికి ఐదు మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలను నీళ్లు పోసి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.చెట్లను కాపాడే బాధ్యత తమ వంతు కర్తవ్యంగా ప్రజలు అందరూ సహకరించి మొక్కలను కాపాడాలని, కాళీ స్థలాల్లో కూడా చెట్లను నాటి మన హుస్నాబాద్ పట్టణాన్ని పచ్చని వనం గా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్ బొల్లి కల్పన ,పట్టణ అధ్యక్షుడు యండి అన్వర్ , మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, కోఆప్షన్ సభ్యులు యండి అయూబ్, ఐలేని శంకర్ రెడ్డి,బొల్లి శ్రీనివాస్, చొప్పరి శ్రీనివాస్, భాష వేణి రాజయ్య, పశ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, రాజయ్య పిన్ని కాశి వెంకటేశం, పొన్నం మల్లయ్య, ఖాదర్ పాషా ప్రజలు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.