హర్యానాలో 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దుకాణాలకు సరి, బేసి విధానాలలో అనుమతులు
చండీఘడ్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.
పాజిటివ్‌ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించడానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే, కొంత వరకు నిబంధలను మాత్రం సడలించినట్లు హర్యానా రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ వర్ధన్‌వెల్లడిరచారు.
కార్పొరేట్‌ఫీసులలో 50 శాతం ఉద్యోగులు, కోవిడ్‌? నిబంధనలు పాటిస్తూ హజరవ్వాడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలను సరి, బేసి విధానాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. షాపింగ్‌ మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక, బార్‌లు, హోటల్‌లు, రెస్టారెంట్‌, క్లబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచుకోవచ్చని తెలిపారు. వీటిలో కూడా 50 శాతంమేర ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు. ప్రార్థన మందిరాలలో ఏసమయంలో అయినా.. 21 మందికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలలో 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బరాత్‌లకు, ఊరేగింపులు, ఇతర సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా.. అంతిమ సంస్కారాలకు కూడా కేవలం 21 మందిలోపు మాత్రమే హజరవ్వాలని సూచించారు. అయితే, గత నెలలో హర్యానా రాష్ట్రం లో ప్రతిరోజు 15,000 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం ఆసంఖ్య 9,974 కు తగ్గినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.