* హస్నాబాద్ గ్రామంలో భూకబ్జా

ఖమ్మం జిల్లా.  తిరుమలాయపాలెం  జనం సాక్షి. ( జూన్ 21 ) తిరుమలాయపాలెం మండల పరిధిలోని హస్నాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 110 లో ఉన్నటువంటి భూమిని సుమారు పది సంవత్సరాల క్రితం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి . ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హస్నాబాద్ గ్రామంలో ఉన్న పసలాది వీరన్న S/O సోమయ్య  .అనే వ్యక్తికి ప్రభుత్వం వారిని దళితులు గా గుర్తించి  సుమారు రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది దిన్ని ఆసరగా తీసుకొని అదే సర్వేనెంబర్ లో పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పలాది  వీరన్న సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని  జె సి బి సహాయంతో సదనం చేసి దానిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నాడు  కావున  తిరుమలాయపాలెం తాహసీల్దారు . 110 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం సర్వే జరిపించి దానిని గవర్నమెంట్ కు స్వాధీనపరిచి  హస్నాబాద్ గ్రామంలో ఉన్న దళితులకు కేటాయించాలని మాలమహానాడు మండల అధ్యక్షుడు రామకృష్ణ మరియు హస్నాబాద్  గ్రామ అధ్యక్షుడు పల్లి భాస్కర్ మరియు బచ్చోడు గ్రామ అధ్యక్షుడు సందు రాజు గుంతేటి ప్రభాకర్ ,కాశీమల్ల మహేందర్ ,డిమాండ్ చేశారు. ఇట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దళితులకు కేటాయించుకుంటే మాల సంఘం నాయకులు స్వాధీన పరచుకొని పేద ప్రజలకు దళితులకు అందజేయడం జరుగుతుంది. మాల మహానాడు మండల అధ్యక్షుడు గుజ్జ రామకృష్ణ అన్నారు.  …