హిందూ – ముస్లిం ఐక్యతకై సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ – ముస్లిం ఐక్యత కోసం,  దేశంకోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని, త్యాగాలను నేటి తరానికి పరిచయం చేస్తూ,  అన్ని రకాల మతోన్మాదలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే జైహొ ఉద్యమం ప్రధాన లక్ష్యమని జైభారత్ రాష్ట్ర కార్యదర్శి కాషాపగా ఇమ్మయ్య అన్నారు.ఆదివారం జాహిరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందూ – ముస్లిం ల ఐక్యతే ప్రధాన లక్యంగా ఈ నెల 23వ తారీకున అచ్చాంపేట్ లో వేలాది మందితో ర్యాలీ, సమైక్యతా ప్రదర్శన, రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులు అస్ఫక్_బిస్మిల్ లను ఉరితీసిన దినం డిసెంబరు 23 తారీకు నుంచి గాంధీజీ అమరత్వం జనవరి 30తారీకు వరకు హిందూ – ముస్లిం సమైక్యతా దినాలుగా పాటిస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సభలు, సమైక్యతా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ- ముస్లిం ఐక్యతకై   రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఈ ఐక్యత దినాల్లో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని కోరారు. ఐక్యతకై, దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను గాంధీజీ, గఫార్ ఖాన్, గణేష్ శంకర్ విద్యార్థి, షోయబుల్లాఖాన్, బిబి అంతుస్ససలాం, ఉద్దంసింగ్, వివేకానందలు హిందూ – ముస్లింల ఐక్యతకై కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో  కె యు నాయకులు ఎర్రోళ్ల పోచన్న యల్ . వేణు గోపాల్
తెలంగాణ సోషల్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి. రమణి అనిల్ బహుజన సంక్షేమ సంఘం ప్రకాష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు