హీరో శివాజిపై.. వైసీపీ నేతల ఫిర్యాదు
– శివాజిని విచారిస్తే నిజాలు బయటకొస్తాయని వెల్లడి
విజయవాడ, అక్టోబర్29(జనంసాక్షి) : సినీహీరో శివాజిపై విజయవాడ పోలీస్ కవిూషనర్ ద్వారకా తిరుమలరావుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డిలు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ గరుడ’లో వైఎస్ జగన్ పై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుసని వైసీపీ నేతలు ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో శివాజి పాత్ర కూడా ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు. ఆపరేషన్ గరుడపై శివాజి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనను కూడా విచారించాలంటూ సీపీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం.. 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్ గరుడ లక్ష్యంమని శివాజి గతంలో తెలిపారు. దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారని, ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారని, ఇలా వచ్చేవారిలో ఒక కొత్త నాయకుడూ ఉన్నాని శివాజి వీడియోలో వివరించారు. ఇప్పటికే ఉన్న ముఖ్యపార్టీ నాయకుడిపైన ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారని, ఆయనకు ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుందని, ఈ దాడివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాచని శివాజి చెప్పిన విషయం విధితమే. కాగా ఇదేరీతిలో జగన్‌పై ఇటీవల హత్యాయత్నం జరగడంతో శివాజిని విచారిస్తే అన్ని భయటకు వస్తాయని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.