హెచ్‌ఎండిఎ పరిధిలో పార్కుల అభివృద్ధి

2019 నాటికి పనులన్ని పూర్తి అయ్యేలా కార్యాచరణ
అధికారులతో సిఎస్‌ సవిూక్ష
హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): హెచ్‌.యం.డి.ఏ పరిధిలోని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల పక్రియను నెల రోజుల లోపు పూర్తి చేసి మార్చి 2019 నాటికి పనులన్ని పూర్తి అయ్యేలా కార్యచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో  అటవీ పార్కుల అభివృద్ధిపై సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, ఊఓఆం కవిూషనర్‌ చిరంజీవులు, మెట్రోరైల్‌ యం.డి ఎన్‌.వి.ఎస్‌ రెడ్డి, బి.కళ్యాణ చక్రవర్తి, పిసిసిఎఫ్‌ పి.కె.ఝా, సియంఓ. ఓఎస్‌ డి ప్రియాంక వర్గీస్‌, జిహెచ్‌ఎంసి అదనపు కవిూషనర్‌ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.  ఏడు జిల్లాలో విస్తరించి ఉన్న అర్భన్‌ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్న వివిధ శాఖల అధికారులతో సి.యస్‌ ఈ సందర్బంగా సవిూక్షించారు. మొత్తం 59 పార్కులకు గాను అటవీ శాఖ తదితరుల శాఖలను పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కులకు సంబంధించిన సివిల్‌, పెన్సింగ్‌ పనుల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల పక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. నిర్మిస్తున్న అర్బన్‌ పార్కులకు సంబంధించి లైన్‌ సర్వేను చేపట్టి ఇన్‌ ఫ్యాక్ట్‌ అసెన్‌ మెంట్‌ చేయాలని, భూగర్భజలాలు, ఏయిర్‌ క్వాలిటీలలో వచ్చిన మార్పులపై రిపోర్టును పొందాలని సి.యస్‌ ఆదేశించారు. పార్కు నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. పార్కులనీ సహజంగా, పర్యావరణహితంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సి.యస్‌ అన్నారు.