హైకోర్టు న్యాయవాద దంపతులకు నివాళులు అర్పించిన మంథని బార్ అసోసియేషన్

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని బార్ అసోసియేషన్ హాల్లో హైకోర్టు న్యాయవాద దంపతులైన గట్టు వామన్ రావు- నాగమణి దంపతులకి న్యాయవాదులు శుక్రవారం పూలమాల వేసి , నివాళి అర్పించడం జరిగింది . ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్, సీనియర్ న్యాయవాది రగుత్తమ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల దంపతుల హత్య జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తానని అన్న ప్రభుత్వం మాట తప్పిందన్నారు. న్యాయవాదుల మీద రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చేస్తుందన్నారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో సిబిఐ తో ఎంక్వయిరీ చేయించాలని, అనేక అనుమానాలు హత్య విషయంలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వము న్యాయవాదులకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి చందు పట్ల రమణ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సహేందర్ రెడ్డి , శ్రీకాంత్, న్యాయవాదులు బోట్ల అంజనేయులు, కటకo శ్రీనివాస్, దండే విజయ్ కుమార్, స్రవంతి,అర్ల నాగరాజ్, షబానా, శ్రీహరి, శ్రీనివాస్ శశిభూషణ్ కాచే, రాచర్ల రాజేందర్, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు.