హైడ్రా అంటేనే హడలిపోతున్న ఆక్రమణదారులు
ఆక్రమణదారులు ఎవరైనా చర్యలు తప్పవన్న సంకేతాలు
ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన
గండిపేటలో అనుకూలంగా యువత ప్రదర్శనలు
కొత్తగా ఇప్పుడు ఓవైసీ వంతు రావడంతో సవాళ్లు
హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలామంది హడలిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్టాల్ల్రో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆక్రమణల తొలగింపు పర్వాన్ని హైడ్రా గత కొన్ని వారాల ముందు నుంచే చేపట్టగా.. హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా కూల్చివేయడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. రాజకీయ పార్టీలు కూడా విభిన్న రీతిలో దీనిపై స్పందిస్తున్నాయి. కాగా హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు తమ కట్టడాలు కూల్చేస్తాయో అని హైదరాబాద్‌లోని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. హైడ్రాతో ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతోందని విపక్షాలు విమర్శిస్తుంటే.. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. తగ్గేదేలే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. అటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు కొన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తోంది. కెసిఆర్ హయాంలోనే ఎన్ కన్వెషన్ కూలుస్తారని అనుకున్నారు. కానీ ఏదో మతలబు జరగడంతో ఆగిపోయింది. నాగార్జున కూడా ఇక తనకు ఢోకా లేదని,కెసిఆర్‌తో అంటకాగారు. ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రా నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిసతోంది. ఎవరు ఆక్రమణ దారులైనా చర్యలు తీసుకోండని ప్రజల్లో సానూకూలత వస్తంది. రేవంత్ సర్కార్ నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
ఈ క్రమంలో హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ నిర్వహించింది. ఈ సపోర్ట్ వాక్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు. హైదరాబాద్ లో అక్రమకట్టడాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ కట్టడాలను కూడా కూల్చివేస్తారా? అని భయపడుతున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ తోపాటు పలువురి అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో సోషల్ విూడియాలో హైడ్రా కూల్చివేతలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చెరువులను కబ్జా పెట్టి నిర్మించారంటూ పలువురు.. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసికి చెందిన బిల్డింగ్‌లు కూడా ఉన్నాయి. బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందని వార్తలు వస్తుండటంతో ఆయన స్పందించారు. ’పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించా. కొందరు వీటిపై వక్రదృష్టి పెట్టారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుª`లలెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడ కండి’ అని అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఇక, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు తమ కాలేజీలను చెరువులను కబ్జాచేసి కట్టారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటిని కూడా హైడ్రా కూల్చివేసేందుకు సిద్ధమైతున్నట్లు సమాచారం. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని సిఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అధర్మం ఓడాలంటే యుద్ధం త ప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని ఆయన తెలిపారు. మహానగరంలో చెరువులను చెరబట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని సిఎం రేవంత్ వెల్లడిరచారు. నిజాం ఆనాడే హైదరాబాద్‌ను లేక్ సిటీగా గుర్తించి గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారని సిఎం రేవంత్ తెలిపారు. కరువు వచ్చిన సమయంలో గండిపేట, ఉస్మా న్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయని, కానీ, కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకొని, ఆ నాలాలు గండిపేటలో కలిపారని, ఇప్పుడు వాటిని తాగునీటిగా ఉపయోగించేందుకు ఇబ్బందిగా మారిందని సిఎం రేవంత్ తెలిపారు. అలాంటి అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ప్రజా ప్రతినిధిగా తాను విఫలమైనట్లేనని, అందుకే ఎవరు ఎంత ఒత్తిడి చేసినా మిత్రులకు ఫాంహౌజ్ లు ఉన్నా హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి, చెరువులను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని సిఎం రేవంత్ అన్నారు. ప్రకృతి విధ్వంసం చేస్తే ప్రకృతి విలయం ఎలా ఉంటుందో చూస్తున్నామ ని, ఇప్పటికే చెన్నై ఉత్తరాఖండ్, వయనాడ్‌లలో ఏం జరిగిందో చూశామని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని, ఇందులో భాగంగానే చెరువులను రక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని సిఎం హెచ్చరించారు. ఇకపోతే హైడ్రా తీసుకున్న చర్యలు, కాపాడిన భూముల వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి చేరింది. గత రెండు నెలల నుంచి చెరువుల్లో, పార్కుల్లో, ప్రభుత్వ భూముల్లో చేపట్టిన కూల్చివేతలు, కాపాడిన భూముల వివరాలను ఆ నివేదికలో వివరించారు. ఆదివారంప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తన నివేదికను అందజేశారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని 8 మునిసిపల్ కార్పొరేషన్‌లు, 20 మునిసిపాలిటీలు, 33 పంచాయతీల
పరిధిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు కమిషనర్ వెల్లడిరచారు. జూన్ 27 నుంచి ఈనెల 24 వరకు చేపట్టిన కూల్చివేతలకు సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపరిచారు. కూల్చివేతలు చేపట్టిన 18 ప్రాంతాల్లోని కబ్జాల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆ నివేదికలో తెలిపారు. హైడ్రా తీసుకున్న చర్యల్లో ముఖ్యంగా చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లతో పాటు పార్కు స్థలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు ఉన్నాయని, ఇందులో పలువురు రాజకీయ నేతలు, సినీనటులు, క్రీడాకారులు కూడా ఉన్నట్టు హైడ్రా నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌ఓసిలు లేవు. అనుమతులు అంతకన్నా లేవు. కోర్టు కేసులు, క్రమబద్ధీకరణ లేకుండానే చెరువులను ఆక్రమించు కోవడం, నిర్మాణాలను చేపట్టడం ఈ చర్యలతో బహిర్గతమైనట్టు తెలిపినట్టు సమాచారం. వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, సమగ్రంగా విచారణ చేపట్టిన అనంతరం చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సందర్భంలో తెలియజేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొందరు కేసులని, అనుమతులు ఉన్నాయని, ఎన్‌ఓసిలు తీసుకున్నామని చెబుతూ వ్యవస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు రంగనాథ్ తెలిపారనేది సమాచారం. చింతల్ చెరువులో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను నేలమట్టం చేసి 3 ఎకరాల 5 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆ నివేదికలో పొందుపరిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్ పార్కు స్థలంలో ఎంఎల్‌ఎ నాగేందర్ మద్దతుదారుడు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించి 18 గుంటల భూమిని కాపాడినట్టు వెల్లడిరచారు. ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్‌పురా ఎంఎల్‌ఎ మహ్మద్ ముబిన్, ఎంఎల్‌సి మిరాజ్ రెహ్మత్ బేగ్‌కు చెందిన రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి బూమ్‌రుఖ్ ఉద్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల రెండు భవనాలను, ఒకటి రెండంతస్థుల భవనంతో పాటు మరో భవనాన్ని నేలమట్టం చేసినట్టు రంగనాథ్ తన నివేదికలో వివరించారు. ఈ చెరువు పరిధిలో మొత్తం 46 అక్రమ కట్టడాలను తొలగించడం ద్వారా 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. గండిపేట్ జలాశయం ఎఫ్‌టిఎల్ పరిధిలోని చిలుకూరు, ఖానాపూర్‌లలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జివి భాస్కర్‌రావు, మంథని అసెంబ్లీ ఎంఎల్‌ఎగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ అధికారికంగా అనుమతులు తీసుకోకుండా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహరీలను కూల్చివేసినట్టు తెలిపారు. ఈ చర్యలతో ఖానాపూర్, చిల్కూరు ప్రాంతంలో గండిపేట్ జలాశయం ఎఫ్‌టిఎల్ పరిధిలోని 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా నివేదికలో వివరించారు. మాదాపూర్ తమ్మిడికుంట చెరువులో అనుమతులు లేకుండా ఎఫ్‌టిఎల్ పరిధిలో సినీనటుడు నాగార్జున అక్రమంగా నిర్మించిన ఎన్‌కన్వెన్షన్‌లో రెండు నిర్మాణాలను కూల్చివేసి 4 ఎకరాల 9 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రదేశంలోని పార్కు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించి 16 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మన్సురాబాద్‌లో 2 గుంటలు, ఎంపి, ఎంఎల్‌ఎల కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలానగర్‌లో ఎకరం 4 గుంటలు, ఫిల్మ్‌నగర్‌లోని బిజెఆర్ నగర్‌లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్‌ను కూల్చేసి 5 ఎకరాలు, గాజులరామారం మహదేవపురం వద్ద ఒక గుంట, గాజుల రామారం భూదేవిహిల్స్‌లో ఎకరం ఒక గుంట, అవిూర్‌పేట్‌లో గుంట, చందానగర్ ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న మూడంతస్థుల భవనం ఒకటి, నాలుగు అంతస్థుల భవనాలు రెండు కూల్చేసి 16
గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన నివేదికలో తెలిపారు. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడుప్పల్ రెవెన్యూ భూమిలో 3 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆ నివేదికలో వివరించారు.