హైడ్రా కూల్చివేతలతో ఉలిక్కిపాటు

బిఆర్‌ఎస్‌కు నిద్దర పట్టడం లేదా?
రేవంత్‌ లక్ష్యంగా ఎదురుదాడి రాజకీయాలు
ప్రజలు ఈసడిరచుకుంటున్నా..అవే విమర్శలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి): పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన బిఆర్‌ఎస్‌కు నిద్రపట్టడం లేదు. ప్రధానంగా కెసిఆర్‌ కుటుంబానికి, వారిని నమ్మకున్న ఒకరిద్దరు రాజకీయ నేతలకు అస్సలు నిద్రపట్టడం లేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరవాత.. సిఎం రేంవత్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, కార్యక్రమాలు, అమలు చేస్తున్న తీరు, చేపడుతున్న చర్యలతో బిఆర్‌ఎస్‌ నేతలకు నరంవిూద పుండు సల్పినట్లుగా ఉంది. తట్టుకోలేక పోతున్నారు. రుణమాఫీని తట్టుకోవడం లేదు.హైడ్రా కూల్చివేతలను అస్సలు తట్టుకోవడం లేదు. ఎలాగైనా రేవంత్‌ను టార్గెట్‌ చేయాలన్న లక్ష్యంతా విమర్శలకు దిగుతున్నారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను పక్కన పెట్టి ఎదురుదాడి రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సిఎంగా కొనసాగితే ఇక తమకు మనుగడ ఉండదన్న భావనలో, భయంలో ఉన్నారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే సిఎంగా రేవంత్‌ రెడ్డి ఉండకూడదన్నదే కెసిఆర్‌, కెటిఆర్‌, హరీష్‌ రావుల పాలసీగా ఉంది. అందుకే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడుతున్నారు. విమర్శల కు పదను పెడుతున్నారు. ఒకటి తమ అవినీతి, అక్రమాలు బయటపడకుండా చూసుకోవడంతో పాటు… రేవంత్‌పై బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హైడ్రా కూల్చివేతలను స్వాగతించాల్సిన నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారడం కోసం పల్లా రాజేశ్వర రెడ్డిని వేధిస్తున్నారని హరీష్‌ రావు చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీ అక్రమంగా ఎందుకు కట్టాడో నిలదీయకుండా సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీయడం వారి దౌర్భాగాన్ని సూచిస్తోంది. గత పదేళ్లుగా అక్రమాలను ప్రోత్సహించిన ఆనాటి మంత్రులు ఇప్పుడు కూడా అదే సాగాలని చూస్తున్నారు. అందుకే రేవంత్‌ సిఎంగా ఉన్నంత కాలం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమనే భావనలో ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలను పక్కన పెట్టిమరీ భారాస నేతలు కేవలం రేవంత్‌ రెడ్డినే టార్గెట్‌ చేసుకున్నారు. భారాస శ్రేణులను ప్రేరేపించడానికి, కాంగ్రెస్‌ శ్రేణులను రెచ్చగొట్టడానికి కెటీఆర్‌, హరీష్‌ వంటి వారు వ్యూహ రచన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో ఆందోళనలకు దిగడం, పల్లా రాజేశ్వర రెడ్డిని పక్కన పెట్టుకుని విమర్శలు చేయడం వంటివన్నీ ఇందులో భాగంగానే చూడాలి. ఉద్యమ సమయంలో మాదిరిగా సమయం చూసుకొని కాంగ్రెస్‌లో అవంతర్గత చిచ్చు రాజేయాలని పన్నాగం పన్నుతున్నారని అనిపిస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీపై, సంక్షేమం పట్ల ప్రభుత్వం పై పోరాడాల్సిన నైతిక బాధ్యతను భారాస విస్మరించి తమ తప్పులను కప్పిపుª`చుకునేలా, రేవంత్‌ను తిట్టిపోయడమే లక్ష్యంగా రాజకీయాలు నడుపుతుందనే వాదనలు వస్తున్నాయి. ªూష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష హోదాను తుంగలో తొక్కి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్య పరు స్తోంది. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పోరాడాల్సిన భారాస నేతలు కేవలం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మాత్రమే టార్గెట్‌గా చేసుకోవడం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి. గతంలో విూరే ముఖ్యమంత్రి కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉచిత సలహాలు ఇవ్వడం, ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం పై కొర్రీలు పెట్టే ప్రకటనలు చేయడం, రేవంత్‌ రెడ్డి ఆయన మంత్రివర్గం పనితీరుపై పనిగట్టుకొని ఊహాజనిత ఆరోపణలు, విమర్శలు చేయడాన్ని సైతం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు విూద ఈకలు పీకే రకంగా బిఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిస్తున్నారు.కెటీఆర్‌, హరీష్‌రావు లు అదేపనిగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, విమర్శలు చేయడం, విూడియా సమావేశాలు, ట్విట్టర్లు
వంటివి ఉపయోగించడం ఈ మధ్య అధికమైంది. మొన్న ఆర్టీసీ బసుల్లో ఆడపడుచులపై కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యాలు కూడా ఆయనలోని అసహనాన్ని బహిర్గతం చేశాయి. అయితే వ్యతిరేకత తీవ్రంగా ఆరవడవం, మహిళా కమిషన్‌ నోటీసులతో ఒక్కసారిగా నాలుక కరుచుకున్నారు.రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ గతంలో హరీష్‌ రావు ముఖ్యమంత్రికి విసిరిన సవాల్‌ చేసి భంగపడ్డాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు దశల్లో రుణమాఫీ చేసిన సంగతి తెలిసి కూడా దానిపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి భారాస తెరలేపే ప్రయత్నం చేసింది. రైతుల పేరుతో ఆందోళనలకు దిగింది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ఏకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం భారాస అసమనానికి పరాకాష్టగా కనిపిస్తోంది. మొన్న రేవంత్‌ రెడ్డి అధికారిక అమెరికా పర్యటనను కూడా కెటీఆర్‌ రాజకీయం చేయాలని ప్రయత్నించడం రేవంత్‌ పై వ్యక్తి గత కక్షకు అద్దం పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అంతేకాదు, రేవంత్‌ రెడ్డి మానసికంగా స్థిరంగా లేరని కేటీఆర్‌ చేసిన ఘాటైన మాటలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. భారాస నేతలు చెచ్చిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఫలితమే సిద్దిపేటలో హరీష్‌ రావు కార్యాలయంపై దాడిగా చూడాలి. భారాస నేతలు ఈ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కార్యక్రమాలు చేస్తున్నారో అందుకు ధీటుగా కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతిఘటించే చర్యలకు దిగడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. ప్రతిపక్షం నుంచి ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఏమో గానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏతావాతా రాజకీయాల్లో ఇప్పుడు సిఎంగా రేవంత్‌ ఉండడాన్ని బిఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోవడం లేదు. తమ ఉనికికి ముప్పుగా తయారైన రేవంత్‌ను తప్పించే వరకు ఎత్తులు వేస్తూనే ఉంటారు. యాగీ చేస్తూనే ఉంటారు.