107 సర్వేనెంబర్ హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మాణం

107 సర్వేనెంబర్ హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మాణంలో ఉన్న  బిస్మెట్లు గోడలు స్లాబులను నిర్మించుకున్న నిర్మాణాలను ధ్వంసం చేసిన వాటిని పరిశీలించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం107 సర్వేనెంబర్ హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మాణంలో ఉన్న  బిస్మెట్లు గోడలు స్లాబులను నిర్మించుకున్న నిర్మాణాలను ధ్వంసం చేసిన వాటిని పరిశీలించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం
*భువనగిరి పట్టణంలో 107 సర్వేనెంబర్ హుస్నాబాద్ లో 2008-2009 కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు భువనగిరి పట్టణంలో సుమారు 2000 మందికి సొంత గృహాలు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేయాలని కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్ 107 సర్వే నెంబర్లు పేస్ 1, 2, 3, పద్ధతిలో స్థలాలు కేటాయించి లబ్ధిదారుల పట్టాలు అందజేసి లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల  కొందరు లబ్ధిదారులు బిస్మిట్ లెవెల్, గోడల లెవెల్,  స్లాబులు లెవెల్ నిర్మాణంలో ఉన్న వాటిని బస్వాపురం ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల కొరకు స్థలాన్ని చదును చేస్తే క్రమంలో నిర్మాణం లెవెల్ లో ఉన్న వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్ ఇస్తానుసారంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లు నిర్మించుకుంటున్న  నిర్మాణాలను కులకొట్టిన వాటిని కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం  బాధితులతో ఈరోజు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ప్లాట్లను బస్వాపురం భూ నిర్వాసితుల పేరున భువనగిరి పట్టణ పేదల ప్లాట్లను గుంజుకోవడం ఇది అన్యాయమని నిర్మాణంలో ఉన్న బీస్మెట్లను గోడలను స్లాబ్ లను తొలగించడం కాంట్రాక్టర్ దుచ్చేరేగా భావిస్తూ కాంట్రాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ లబ్ధిదారుల ప్లాట్లను బిస్మిట్లను స్లాబులను యధావిధిగా నిర్మాణం చేయించాలని ప్లాట్లు పోయిన వారికి ప్లాట్లు ఇవ్వాలి గోడలు స్లాబులు ధ్వంసం చేసిన ఇండ్ల నిర్మాణం బదులుగా ఇండ్లు  నిర్మాణం చేసి ఇవ్వాలని ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది  28వ కౌన్సిలర్ కైరంకొండ వెంకటేష్ మాట్లాడుతూ మావార్డుకు సంబంధించి 20 మంది బి డి కార్మికుల ప్లాట్లను అక్రమిస్తున్న అక్రమ దారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేసులు నమోదు చేయాలని మా వార్డు నిరుపేద ప్రజలైన బీడీ కార్మికులకు వాళ్ల ప్లాట్లను వాళ్లకు ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈకార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ పడిగెల ప్రదీప్ అందే నరేష్ రంగ శ్యామ్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ లబ్ధిదారులు బిరుదరాజు శైలజ రాము రంగ పుష్ప దత్తు బట్టు సుగుణ రోజా పద్మ మహేశ్వరి లావణ్య చిక్క పద్మ శ్రీనివాస్ మహేష్ రాకేష్ సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.:–