14 ఏళ్లు పూర్తి చేసుకున్న నగర జంటపేలుళ్లు


ఇంకా సాయం అందక బాధితుల ఎదురుచూపు
హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ జంట పేలుళ్లకు ఆగస్ట్‌ 25తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్‌ లో జంట పేలుళ్లు జరిగాయి. జంట పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు. 14 ఏళ్ళు అయిన ఇంకా ఆ రక్త మరకలు మారలేదు. ఈ పేలుళ్లకు ఇండియన్‌ ముజాహిద్ధిన్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారు చేసింది చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం. ం`1 అనిక్‌ షఫిక్‌ సయ్యద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి లకు ఉరిశిక్ష విధించింది కోర్టు. ఉగ్రవాదులకు ఆశ్రయించిన తారిఖ్‌ అంజుమా కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. 14 ఏళ్ళైన ఆ బాధితులకు సహాయం అందలేదు. అలాగే అనేకులు తీవ్ర గాయాలతో, మానిసిక బాధలతో ఇంకా నరకం అనుభవిస్తున్నారు.