162 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: భారతీయస్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 162,37 పాయింట్లతో 19,417 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 49.85 పాయింట్ల ఆధిక్యంతో 5,905,60 వద్ద ముగిశాయి రెపో రేట్లను ఆర్‌బీఐ సవరించవచ్చన్న సమాచారంతో బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లుకు ఆదరణ అభించింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు లోహ రంగానికి చెందిన షేర్లు కూడా లాభపడ్డాయి.