17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి అవుతుందా?


రుణమాఫీకి ఎగనామం పెట్టి ఎదురుదాడి చేస్తారా
సిఎం రేవంత్‌పై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీకి ఎగనామం పెట్టి మొత్తం రుణమాఫీ చేసినట్లు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. ‘పాక్షికంగా చేసిన.. తప్పైంది అని క్షమాపణ చెప్పు. నోరు బిగ్గరగా చేసినంత మాత్రాన నిన్ను బీఆర్‌ఎస్‌ వదిలి పెట్టదు. కేబినెట్‌లో 31వేల కోట్లు అన్నారు. బ్జడెట్‌లో రూ.26వేల కోట్లు పెట్టారు. తీరా రూ.17933 కోట్లు మాత్రమే ఇచ్చి 22లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు.
రూ.14వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ పూర్తి అయ్యింది అంటున్నారు. సీఎం నీది నోరా? మోరా? రైతుల సంఖ్య 47లక్షలు అని చెప్పి 22లక్షల మంది రైతులకు మాత్రమే చేశారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ఇంకా సిగ్గులేకుండా రుణ మాఫీ చేశామని సంకలు గుద్దుకుంటున్నరని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్‌ అయిందన్నారు. తాము 17వేల కోట్లతో లక్ష రుణమాఫీ చేస్తే 36లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరిగిందన్నారు. కాంగ్రెస్‌ 17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తిగా ఎలా అవుతుందని మాజీమంత్రి ప్రశ్నించారు. రేవంత్‌ ఎక్కడకు చెబితే అక్కడకు వస్తా.. ప్లేస్‌ నువ్వే డిసైడ్‌ చెయ్‌.. సంపూర్ణ రుణమాఫీ అయిందో? లేదో? రైతులనే అడుగుదాం? నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు. మాట తప్పే చరిత్ర నీది? కొడంగల్‌లో ఓడితే రాజీనామా చేస్తా అని చెప్పి మాట తప్పింది నువ్వు తెలంగాణ కోసం మాట విూద నిలబడి రాజీనామా చేసిన చరిత్ర నాది. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన.. కానీ రుణమాఫీ కూడా సంపూర్ణంగా కాలేదు. రేవంత్‌ రెడ్డి ఎనిమిది నెలల ప్రయాణం మోసం. రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదు. రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయండి రుణాలు తీసుకున్న మొత్తం రైతుల సంఖ్య ఎంత, రుణమాఫీ అయిన రైతుల సంఖ్య ఎంతనో పూర్తి వివరాలు బయట
పెట్టాలిరేవంత్‌ పరిపాలనలో ఎª`లాప్‌ రేవంత్‌ తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాప్‌.. రుణమాఫీ చేయనందుకు రాజీనామా చేయాల్సింది నువ్వే.. సిగ్గులేకుండా నన్ను రాజీనామా చేయమంటున్నారు‘ అంటూ విరుచుకుపడ్డారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల విూద ఒట్టేసి చెప్పారని.. చివరకు దేవుళ్ళను కూడా మోసం చేశారన్నారు. ఆ పాపం ఊరికే పోదన్నారు. రేవంత్‌ పాపం ప్రజలకు శాపం కావద్దని తానే ఆ దేవుళ్ళ వద్దకు వెళతానన్నారు. పాపత్ముని క్షమించు, మా ప్రజలను హానీ చేయొద్దని దేవుళ్ల వద్దకు వెళ్లి మొక్కుకుంటా. సీఎం నన్ను బాడి షేమింగ్‌ చేస్తున్నారు. అది విజ్ఞతేనా?.. ప్రశ్నించే వాళ్లు చావాలని కోరుకుంటున్నారు. రేపు చంపడానికి కూడా వెనకాడరని అనుమానం ఉంది. అయినా మేం భయపడడం. నన్ను ప్రశ్నించే నైతిక అర్హత రేవంత్‌ రెడ్డికి లేదు. నువ్వు తప్పు చేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావ్‌. త్వరలోనే రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ కార్యాచరణ ప్రకటిస్తుంది అని వెల్లడిరచారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేయలేదని నేను ప్రశ్నించా. ఆగస్టు15లోపు చేస్తానని మరో తేదీ చెప్పునవ్‌. ఆగస్టు 15వరకు కూడా పూర్తి చేయలేదు. భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారు. కాంగ్రెస్‌ గుండాలతో నా క్యాంప్‌ ఆఫీసుపై దాడి చేయించారు. ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా? మేము అధికారంలో ఉన్నపుడు దాడులు చేస్తే ఉండేవారా అంటూ హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.