18మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 18మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీఎఫ్‌ ఐజీగా పి.వి సునీల్‌కుమార్‌, ఐజీ సీఐడీగా కుమార్‌ విశ్‌వజిత్‌, ఏసీబీ డైరెక్టర్‌గా బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల ఐజీగా సౌమ్య మిశ్రా, ఇంటిలిజెన్స్‌ డీఐజీగా సజ్జనార్‌, ట్రాన్స్‌కో సెక్యూరిటీ అండ్‌ విజిలెన్స్‌ చీఫ్‌గా ఎన్‌. సూర్యనారాయణ, వరంగల్‌ డీఐజీగా విక్రమ్‌సింగ్‌, కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ డీఐజీగా బి.శ్రీనివాసులు, విజిలెన్స్‌ జేఎండీగా పి.ఉమాపతి, కరీంనగర్‌ డీఐజీగా ఆర్‌.భీమానాయక్‌, సీఐడీ విభాగం డీఐజీగా ఈ.దామోదర్‌, ఇంటిలిజెన్స్‌ డీఐజీగా బి.బాలకృష్ణ, ఎపీఎస్పీ డీఐజీగా బి.మల్లారెడ్డి, హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఎ.రవిచంద్ర హైదరాబాద్‌, డీసీపీగా ఎం. నాగన్న, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా ఎం. శివప్రసాద్‌, అప్పా డిప్యూటీ డైరెక్టర్‌గా ఎ.సుందరకుమార్‌దాస్‌ నియమితులయ్యారు.