205 మంది అవినీతి అధికారులపై విజి’లెన్స్’
న్యూఢిల్లీ : ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేసే 205 మంది అవినీతి అధికారులను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) గుర్తించింది. వారిలో అత్యధికంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో 42 మంది ఉన్నారు. తర్వాత.. ఎస్‌బీఐ (14), సిండికేట్ బ్యాంక్ (12), కెనరా, యూనియన్ బ్యాంక్, బీసీసీఎల్ (10) ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు (8), బీఎస్‌ఎన్‌ఎల్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (7), విజయా బ్యాంకు (6), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్ డీఎస్‌ఐడీసీ, ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (4)ల్లో ఉన్నట్లు సీవీసీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి, మే మధ్యకాలంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాల నుంచి రూ. 26.42 కోట్లు సీవీసీ స్వాధీనం చేసుకుంది. ఇటీవల ఒక్క నెల రోజుల్లోనే సీవీసీకి 3243 ఫిర్యాదులొచ్చాయి. వేర్వేరు విభాగాల్లో పనిచేసే 10 మంది అధికారులను విచారించడానికి కమిషన్ అదేశాలిచ్చింది. వారిలో ఐఎఫ్‌ఎస్ అధికారి, కెనరా బ్యాంక్‌లోని ముగ్గురు అధికారులు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ తదితరులున్నారు.