బడుగు బలహీన వర్గాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం – కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నోముల భగత్

తిరుమలగిరి (సాగర్) ,ఫిబ్రవరి 15 (జనంసాక్షి): రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.బుధవారం తిరుమలగిరి (సాగర్)మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హల్ లో వివిధ గ్రామాలకు చెందిన 160 మంది కల్యాణలక్ష్మి,షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.కల్యాణలక్ష్మి, షాదీముబార్ దరఖాస్తులు చేసుకునేటప్పుడు ఏమైన ఇబ్బదులు అయినాయ అని లబ్ధిదారులకు అడిగి తెలుసున్నారు.ఈ కార్యక్రమం లో తహసిల్దార్ ఇస్లావత్ పాండు నాయక్,మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాగార్జున సాగర్ నియోజకవర్గం అధ్యక్షులు భిక్ష్య నాయక్,హాలియా మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు,వైస్ చైర్మన్ ఆడెపు రామలింగయ్య,మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్,హాలియా మార్కెట్ డైరెక్టర్లు బూడిద హరికృష్ణ,పోశం శ్రీనివాస్ గౌడ్,హార్సింగ్ నాయక్,చందర్,రైతు సంగం అధ్యక్షులు పగడాల పెద్దిరాజు,యూత్ అధ్యక్షులు జటవత్ రమేష్ నాయక్,అధికార ప్రతినిధి జటావత్ జవహర్ నాయక్,బిసి సెల్ అధ్యక్షులు కార్తీక్ గౌడ్,సర్పంచ్ లు పెంకీస్ పాపిరెడ్డి,రాంసింగ్ నాయక్,బాసిరెడ్డి భార్గవి శ్రీనివాస్ రెడ్డి,పెదమాము కాశయ్య,సుజాత పాండు నాయక్,చిట్టెపు రామ నర్సమ్మ,తిరుమలగిరి దేవస్థానం కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.