217 ఐఐటీ సీట్లు ఖాళీ

కోల్‌కత్తా: ఐఐటీ మోజు తగ్గడమో, మరో కారణమో తెలియదుకానీ మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత కూడా దేశవ్యాప్తంగా 16 ఐఐటీల్లో మొత్తం 217 సీట్లు ఇంకా భర్తీ కాకుండా మిగిలిపోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ ఐఐటీల్లో ఒక్క దఫానే కౌన్సెలింగ్‌ జరిగేది. అలాంటిది ఐఐటీ సంఖ్య , సీట్లు పెరగడంతో పరిస్థితి మారింది. మూడు దఫాల కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఇంకా సీట్లు మిగిలిపోతున్నాయి. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఇది తక్కువేనంటున్నాయి ఐఐటీ వర్గాలు. 2011లో 757 సీట్లు, 2012లో 322 సీట్లు మిగలగా ఈసారి 217 సీట్లు మాత్రమే మిగిలాయన్నది వారి వాదన.