నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ
జనంసాక్షి , మంథని: సహయా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయగిరి సుధీర్ కీర్తి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నిరుపేద కుటుంబం అయిన మంథని మండలంలోని కుచిరాజ్ పల్లి గ్రామం కి చెందిన రాంబాబు కి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ మేడగొని వెంకటేష్, వైస్ చైర్మన్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్, కోశాధికారి కొమురోజు సురేష్, డైరెక్టర్లు ఐతు డేవిడ్, నార్ల విజయ్ భాస్కర్, సభ్యులు అరెల్లి సాగర్, దండు రమేష్, రాపర్తి అఖిల్ పాల్గొన్నారు.