ఎల్ వో సి మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి, కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామానికి చెందిన దబ్బెట స్వప్న లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సహాయం నిమిత్తం మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే సీఎం సహాయక నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. కాగా శుక్రవారం మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ వో సి మంజూరు పత్రాన్ని అందజేశారు.