వందేళ్ల భవిష్యత్ కు తొమ్మిదేళ్లలో బాటలు

-దేశంలో అన్ని రంగాలలో ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధి

-యువత భవిత కోసమే తెలంగాణ

-కేసీఆర్ నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ

-తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్15 (జనం సాక్షి)వందేళ్ల భవిష్యత్ కు తొమ్మిదేళ్లలో బాటలు వేశామని, దేశంలో అన్ని రంగాలలో ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవల్లి కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి సమక్షంలో భారాస లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని,
యువత భవిత కోసమే తెలంగాణ సాధించామని అన్నారు.భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, సమైక్య పాలకుల వివక్ష మూలంగా తెలంగాణ రెండు తరాలు నష్టపోయింది,
ఆ వివక్ష నుండే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలయిందని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలుగా ప్రజలను చైతన్యం చేసి, తెలంగాణను ఏకం చేసి 14 ఏండ్లు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి విజయం సాధించామని గుర్తు చేశారు.
ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, మౌళిక సదుపాయాల కల్పన, ఉపాధి వంటి రంగాలలో తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలుపుకున్నామని,అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు, వసతుల కల్పనతో చేయూతనిస్తున్నది,ప్రజలు ఒకరిపై ఆధారపడకుండా ప్రభుత్వ తోడ్పాటుతో వారి కాళ్లపై వారు నిలబడాలి అన్నది కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు.ప్రతి కుటుంబానికి సంక్షేమంప్రతి చేతికి పని లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం,ప్రజల ఆకాంక్షల కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నదని,ప్రజల ఆశీస్సులతో మూడో సారి అధికారంలోకి వస్తాం అని తెలిపారు.ప్రజలు, కార్యకర్తల అభిమానం, అండదండలే పార్టీకి కొండంతఅండ అని అన్నారు.వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరిన వనపర్తి యువకులు, రేవల్లి ఎంపీపీ సేనాపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన కేశంపేట వాసులు 30 మంది కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం నల్లచెరువు వద్ద రూ.2 కోట్లతో నిర్మించే ఆధునిక ధోబీఘాట్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి, రజకసంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్, కోశాధికారి పాపన్న, నేతలు అంజనేయులు, జీజే శ్రీనివాసులు, నరేష్, రవి, వెంకటస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు