బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా బోగే రవితేజ
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన బోగే రవి తేజ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేవైఎం కమాన్ పూర్ మండల ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని చందుపట్ల సునీల్ రెడ్డి చేతుల మీదుగా బీజేవైఎం మండల అధ్యక్షుడు పంతకానీ విశ్వతేజ బోగే రవి తేజ కి అందజేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి బోగే రవి తేజ ధన్యవాదాలు తెలిపారు.