చదువు ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందని

-ఇంటింటికి నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు

-210 నిరుపేద విద్యార్థులకు 420.000 రూపాయల స్కాలర్షిప్ అందజేసిన

-యఫ్ టీవీ అధినేత సీఈవో

-పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక సెప్టెంబర్ 15 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో 210 అనాథ మరియు నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు యఫ్ టీవీ అదినేత సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి 210 మంది విద్యార్థులకు ప్రతి నెలకి వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈరోజు రెండు నెలల స్కాలర్షిప్ లను పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదేశాల మేరకు యఫ్ టీవీ సిబ్బంది ద్వారా చదువుకునే నిరుపేద విద్యార్థులకు మొత్తం 210 మంది విద్యార్థులకు 2 రెండు నెలల స్కాలర్షిప్ 4,20,000 రూపాయల స్కాలర్షిప్ లను వీణవంక మండల కేంద్రంలో నిరుపేద విద్యార్థులకు ఇంటింటికి వెళ్లి స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. నిరుపేద విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం మంచి నాణ్యమైన విద్యను వీణవంక గ్రామంలోని విద్యార్థులకి అందించాలని గొప్ప లక్ష్యంతో ప్రతినెల విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ లను పాడి ఉదయ్ నందన్ రెడ్డి అందిస్తున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు పాడి ఉదయ్ నందన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్స్ విభాగం వీణవంక బ్రైట్ లైఫ్ కో-ఆర్డినేటర్ తాళ్లపెళ్లి కుమారస్వామి పాల్గొన్నారు.

 

తాజావార్తలు