హాస్టల్ విద్యార్థినుల అస్వస్థతకు కు ప్రభుత్వ వైఫల్యమే నిదర్శనం-టీడిపిపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మోపతయ్య
అచ్చంపేట ఆర్సీ, 15 సెప్టెంబర్ జనం సాక్షి న్యూస్ : అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గురుకుల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల లో గురువారం సాయంత్రం సుమారు యాభై పైగా విద్యార్థినిలు కలుషితాహారం త్రాగు నీరు వలన అస్వస్థత కు గురైన నేపథ్యంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మోపతయ్య మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శించి వంటశాల,మరుగుదొడ్లు, మంచి నీటీసౌకర్యం పరిశుభ్రత వసతులనుపరీశీలించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో త్రాగే మంచి నీరు, ఆహారం , కలుషితమవుతున్నాయని దీనివలనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. పేద ప్రజల బిడ్డలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు హాస్టళ్ల లో చదువుతున్నారని,ప్రభుత్వ, వైఫల్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని,ప్రధానంగా అధికారుల వార్డెన్ ఎచ్ ఎం ల నిర్లక్ష్యం కారణంగా తుప్పు పట్టిన కలుషిత బోరు నీరు, దుర్గంధం వేదజల్లు తున్న పరిసరాల వండిన కలుషిత ఆహారం వలన సుమారు నాలుగు వందల మంది విద్యార్థుల ఉన్న ఈ ఆశ్రమ పాఠశాల లో నలభై కి పైగా విద్యార్థినిలు తీవ్రంగా కడుపు నొప్పి, వాంతులు, శ్వాస తీసుకో లేని పరిస్థితుల్లో గురువారం సాయంత్రం అంబులెన్స్ లు అవి చాలక లారీలో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారని, ఈ ఘటన చాలా హృదయ విధారకం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనకు కారణమైన ఉద్యోగుల ను అధికారులను ఎవ్వరైనా సరే ఉపేక్షించేది లేదని వారిని శాఖ సంబంధమైన చర్యల తో పాటు చట్టపరంగా శిక్షించాలని కోరారు, ప్రభుత్వం అలసత్వం వహించకుండా వెంటనే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి హాస్టల్లో నాణ్యమైన విద్య తో పాటు పరిశుభ్రమైన త్రాగు నీరు, ఆహారం, వసతులను తక్షణమే కల్పించాలని కోరారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.