సీఎం కేసీఆర్ అభివృద్ధి పల్లె ప్రగతి బాట.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 15 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ఉప్పుసాక గ్రామం ఎస్సీ కాలనీ ఎస్టి కాలనీ లలో రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ సీఎం కేసీఆర్ అభివృద్ధి పల్లె ప్రగతి బాట కార్యక్రమం నిర్వహించారు. ఉప్పుసాక ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రాంతాలలో పర్యటించి తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ సదర్భంగా జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఎస్ ఎస్ టి బి సి మైనార్టీలకు రైతులకు పెద్ద పేట వేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. అదే విధంగా పినపాక నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే రేగా కాంతారావు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి, పినపాక నియోజవర్గ ప్రజల కష్టాలు తీర్చినది రేగా కాంతరావు అని అన్నారు. అందులో భాగంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, బ్రిడ్జిలు, వంతెనలు, కమ్యూనీటి భవనాలు, నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రైతు గిడ్డంగులు, సీఎం సహాయ నిధులు, పెళ్లి అయిన ఆడపిల్లకు కల్యాణ లక్ష్మి, సాది ముబారక్, పథకం ద్వారా లక్ష రూపాయల సహాయం, వికలాంగులుకు నాలుగు వేల రూపాయలు పెన్షన్, వితంతు మహిళకు రెండు వేలు, వృద్ధాప్య పెన్షన్ ద్వారా రెండు వేల రూపాయలు, రైతు బంధు ద్వారా ఎకరానికి పది వెలు, ఎవరైనా రైతు మరణిస్తే రైతు బీమా ఐదు లక్షలు, రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ లక్ష రూపాయల మాఫి, దళిత బందు, బీసీ బందు, మైనార్టీ బందు, ఇంకా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూసిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు, అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఇంచార్జ్ లు, యువజన విభాగం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు