రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో కుల సంఘాలు కలిసి రావాలి

-మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పాల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్

-5వ రోజు దీక్షలో కూర్చున్న మున్నూరు కాపు సంఘం నాయకులు

-జేఏసీ పోరాటానికి మున్నూరు కాపు సంఘం అండగా

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 15 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు కలిసి రావాలని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పాల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ కోరారు. శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో చేర్యాల పట్టణ మున్నూరు కాపు సంఘం నాయకులు కూర్చున్నారు. వారికి జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్, కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి లు కండువా కప్పి దీక్షలను ప్రారంభించారు. అనంతరం మున్నూరు కాపు సంఘం తరపున దీక్ష ఖర్చులకు 11వందల పదహారు రూపాయల సహాయాన్ని జేఏసీ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంగా, తాలూకాగా ఒక వెలుగు వెలిగిన చేర్యాల అస్తిత్వాన్ని కోల్పోయి ఈ ప్రాంతాన్ని కుక్కలు చించిన విస్తారు లాగా విడదీసి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించడానికి ముఖ్యమంత్రిని ఒప్పించి రెవెన్యూ డివిజన్ గా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు. ఈ దీక్షలకు మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, కౌన్సిలర్ ముస్త్యాల తార యాదగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు తడక లింగమూర్తి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి సిద్దిలింగం, సిపిఐఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో, టీడీపీ మండల అధ్యక్షుడు కురారం బాలనర్సయ్య, బిజ్జ రాము, బండి సుదర్శన్ సంఘీభావం తెలిపారు. ఈదీక్షలలో మున్నూరు కాపు సంఘం నాయకులు పిల్లి చంద్రం, వెలుగల దుర్గయ్య, ఆవుశర్ల నర్సింహులు, దాసరి నర్సింహులు, అవుశర్ల భాస్కర్, దాసరి అనీల్ కుమార్, తాడెం ప్రశాంత్, పిల్లి బాలమల్లు, ఆవుశర్ల కిష్టయ్య, వెలుగల బాల్ నర్సయ్య, ఖాత నాగరాజు, పిల్లి బాబూరావు, అల్లం శ్రీనివాస్, పిల్లి లక్ష్మణ్, కాసుల భాస్కర్, అవుశర్ల శివ కృష్ణ, వెలుగల సంతోష్, వెలుగల మల్లేశం, తాడెం వెంకట స్వామి, ఆనంతుల వేణు గోపాల్, బత్తుల ప్రభాకర్,ఉట్లపల్లి మల్లయ్య, అవుశర్ల విమల్, ఆకుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు