విద్యుత్ సవరణ బిల్లు 2020ను రద్దు చేయాలి-ఎస్ కే యం మండల కమిటీ డిమాండ్

టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి ): విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కే యం) టేకులపల్లి మండల కమిటీ శుక్రవారం డిమాండ్ చేశారు. టేకులపల్లి మార్కెట్ కమిటీ యాడ్ నందు సదస్సు ఏర్పాటు చేసి ఈ సదస్సులో రైతు ఎస్ కె ఎం జిల్లా కన్వీనర్ బానోత్ ఉక్ల నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలపై రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాలని. విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రద్దు చేయాలని రైతుల రుణాలను మాఫీ చేయాలని, రుణ విమోచన చట్టం చేయాలని, రైతులకు అనుకూలంగా పసల్ భీమా పథకాన్ని మార్చాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతుల కొరకు సంఘటితముగా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు రామచందర్, రైతు నాయకులు భూక్య హార్జ, మండల నాయకులు వీర బ్రహ్మచారి, జరపుల సుందర్,ఈసం నరసింహారావు, కే వీరన్న,శ్రీను, వాసం భద్రయ్య, నర్సింగ్, కిరియా,భారతి, సమ్మక్క, సీత తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు