పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

జనం సాక్షి , మంథని : ఈ పార్లమెంట్ సమావేశంలో బిజెపి ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని తెలంగాణ లేబర్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ ఇరుగురాల సంతోష్ న్యాయవాది డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలుపుతూ మద్దతు పలికారు.ఏండ్లు గడిచిన ప్రభుత్వాలు మారిన ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోవడం సిగ్గుచేటని ఆయన బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రభుత్వాలు ఎస్సీ ఉపకులాలను ఓట్ల కోసం వాడుకుని ఎన్నికల వరకు మాత్రమే వర్గీకరణ చేస్తామని హామీలు పలుకుతూ ఎన్నికల తదుపరి ఎస్సీ వర్గీకరణను దాటవేస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీ ఉపకులాల్లో ఏబిసిడిలు ఉన్నట్టుగానే ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న నాయకులు అమరులయ్యారని అయినప్పటికీ ప్రభుత్వాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్లమెంటు సమావేశంలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంథని చందు, ఎంఆర్పిఎస్ నాయకులు కల్వల లక్ష్మయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.

తాజావార్తలు