పేదల వైద్యం గాలికి వదిలేశారు..!

– ప్రభుత్వ ఆసుపత్రికి పక్కా భవనం లేకపోవడం నాయకుల అసమర్ధ పాలనకు నిదర్శనం
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి విమర్శ జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని సామాజిక అర్యోగ కేంద్రం (గవర్నమెంట్ హాస్పిటల్)ను శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సందర్శించి, పలువురు రోగులని పరామర్శించి, హాస్పిటల్ అందుతున్న సేవలు, సిబ్బంది పని తిరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో హాస్పిటల్ లో అందిస్తున్న సేవలు, ఆధునిక పరికరాల తీరును,అడిగి తెలుసుకున్నారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ… మంథని ప్రాంతంనుండి ప్రధాన మంత్రి, స్పీకర్, మంత్రి, జడ్పీ చైర్మన్ గా పదవులు అనుభవించి, ఒక మంచి హాస్పిటల్ కట్టించలేకపోవడం మంథని ప్రాంతానికి వీరి అసమర్ధ పాలనకు నిదర్శనమని విమర్శించారు. నిధులు తీసుకొని వచ్చి కొత్త భవనం నిర్మించే చిత్త శుద్ధి నాయకులకు లేదా..? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో స్వయాన సీఎం కేసీఆర్ వంద పడకల స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదని అన్నారు. ఈ హాస్పిటల్ భవనం శిథిలావస్థలో ఉన్న పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని, ఉన్న ఒక హాస్పిటల్ లో వసతులు సరిగా లేక, చిన్న వ్యాధులకు మాత్రమే చికిత్స అందిస్తూ , ఎమర్జెన్సీ సేవలు, అందుబాటులో లేక, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సీజనల్ లో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెంది అవకాశం ఉందని, ఈ ప్రాంతం లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తప్పకుండా నిర్మించాల్సి ఉండే కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్మించలేకపోయారన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే మంథని ప్రాంతంలో మల్టీస్పెషల్ హాస్పిటల్ ను నిర్మిస్తామన్నారు. రోజురోజుకీ రక్త కణాలు తగ్గి చాలామంది హాస్పిటల్లో సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు కనుక మరింత సిబ్బందిని, మెరుగైన వైద్య సేవలను అందించాలని బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతి కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, పట్టణ ఇంచార్జ్ సబ్బని సంతోష్, రామగిరి ఇంచార్జ్ ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సాగర్, పట్టణ ఉప అధ్యక్షులు గురువేష్,మండల ఉపాధ్యక్షులు రేపాక శంకర్, మహిళ మోర్చా మండల అధ్యక్షులు బోసెల్లి మౌనిక,సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, చిదురాల మధుకర్ రెడ్డి,దోడిపట్ల శంకర్, తోటనాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

తాజావార్తలు