బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రాచకొండ ప్రేమ్ సాగర్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఈ 12న మంగళవారం జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా నిలవాలని జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గారు కమాన్ పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తో పాటు బిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో జమ చేసిన 15.000 /- రూ ఆర్థిక సహాయాన్ని, కమాన్ పూర్ ఎంపిటిసి-1 కోలేటి చంద్రశేఖర్ 50 కిలోల బియ్యం శుక్రవారము బాధిత కుటుబానికి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ ఏ.ఎం.సి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, కమాన్ పూర్ ఎంపీటీసీ-1 కోలేటి చంద్రశేఖర్, స్థానిక ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, యూత్ అధ్యక్షుడు సిరవేణి వేణు, నాయకులు ఇనగంటి రామారావు, రాచకొండ రవి, గాదె సది, బోయిని బాలకృష్ణ, బొల్లపల్లి శంకర్ గౌడ్, దండే కనకరత్నం, జంగిలి అంజి, ఆకుల గట్టయ్య, దండే రమేష్ ఠాగూర్, అవునూరి మొండయ్య, బి.కుమారస్వామి, సింగం శ్రీనివాస్, ఏ.నారాయణ, మల్యాల భాస్కర్, డి. రమేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు