మట్టి వినాయకుల తయారీ పై విద్యార్థుల్లో అవగాహన కలిగించాలి-డీ.ఈ. ఓ యాదయ్య

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, బంక మట్టి వినాయకుల ప్రాధాన్యత, తయారు చేయు విధానం పై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. యాదయ్య అన్నారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్, విద్యాశాఖ, రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన బంకమట్టి వినాయకుల ప్రాధాన్యతను తెలియజేసే కరపత్రాలను, పోస్టర్లను గ్రీన్ కోర్ జిల్లా కో.ఆర్డినేటర్,రాష్ట్ర శిక్షకుడు గుండేటి యోగేశ్వర్, విద్యాశాఖ కార్యాలయ అధికారులతో కలిసి కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీ .ఈ. ఓ మాట్లాడుతూ పాఠశాలల్లో నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో బాగంగా వినాయక చవితిని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల గ్రీన్ కోర్ పర్యావరణ క్లబ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో మట్టి వినాయకుల తయారీపై శనివారం అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సులభమైన పద్ధతిలో మట్టి వినాయకున్ని తయారు చేసే విధానం,సలహాల కొరకు 9849 254747 చరవాణిని సంప్రదించవచ్చని తెలిపారు.గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్ యోగేశ్వర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పూతలో వాడే రసాయనాలు గల రంగుల వలన నిమజ్జనం అనంతరం నీటిలో అవక్షేపంగా ఏర్పడిన కాలుష్యం వలన జలచర జీవుల,నీటి మొక్కల మనుగడకు విఘాతం కలిగిస్తుంది పేర్కొన్నారు.మానవులు, పశుపక్షాదులపై అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి అన్నారు.
వినాయక చవితికి మట్టి గణపతిని పూజించి పర్యా వరణాన్ని కాపాడాలని కోరారుఈ కార్యక్రమంలో… విద్యాశాఖ వివిధ సెక్టోరియల్ అధికారులు , శ్రీనివాస్, చౌదరి, రాజ్ కుమార్, హేమలత, సూపరిండెంట్లు సత్యనారాయణ, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

తాజావార్తలు