తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆర్ల నాగరాజు
జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది, అంబేద్కర్ వాది అయిన ఆర్ల నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్ల నాగరాజుకు, అంబేద్కర్ వాది, దళిత మేధావి, జే.బీ. రాజు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని, ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని వారు తెలిపారు. కుల నిర్మూలనకు , దళిత సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. దళితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిలు మహేందర్, రాకేష్, కోశాధికారి ప్రవీణ్, పాల్గొన్నారు.